మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని అన్నారు.

హరీష్ రావు ఆశా వర్కర్ల నిరసనపై పోలీసుల దాడిని ఖండిస్తూ, రుణమాఫీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రెండు లక్షల రుణమాఫీ పై ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఆరు నెలలు అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టి రైతులను మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేస్తోందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, పెన్షన్ దారులు అందరూ మోసపోతున్నారని హరీష్ రావు అన్నారు.

కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం, రైతుబంధు, రుణమాఫీ కోసం నిధుల్లేవని చెప్పడం విడ్డూరమని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను రైతులు, ప్రజలు నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment