చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.

|| దృశ్యం న్యూస్ ||

గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

మదన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న హరీష్ రావు ఇతర నాయకులు మదన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ మదన్ రెడ్డి త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవకు సిద్ధం కావాలని ఆకాంక్షించారు.

మదన్ రెడ్డి ఆరోగ్య పరిరక్షణకు అన్ని విధాలా ప్రోత్సాహం ఉంటుందని, ఈ విషయంలో పలువురు నాయకుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment