|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ రోడ్‌లోని రోటరీ నగర్‌లో గల హొవార్డ్ పాఠశాలలో చిట్టి చేతులు, భలే భలే రుచులు” పేరుతో ప్రత్యేక కుఖరి కాంపిటేషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు స్వయంగా ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన, స్టవ్ వాడకం లేని ఆహార పదార్థాలను ప్రదర్శించారు. విద్యార్థులలో సృజనాత్మకత, సమయపాలన, ఐక్యత, పోటీతత్వం పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ రత్న తేజ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ చెఫ్ టి. ఆదిత్య హాజరై విద్యార్థులు చేసిన వంటకాలును రుచి చూసి విజేతలను ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ టీవీఆర్ మూర్తి, ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ డా. శశికళ మాట్లాడుతూ, చిన్నారులు వారి చిట్టి చేతులతో తయారుచేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యకరంగా ఉండటం గమనార్హమన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఉపయుక్తమవుతాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనగా, విద్యార్థులు పెద్దఎత్తున స్పందించి తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.








