|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో నామినేషన్ల చివరి రోజు ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో చేరడంతో ప్రక్రియ మరింత ఉత్సాహంగా సాగింది. సర్పంచ్ పదవికి జనరల్ మహిళ రిజర్వేషన్ ఉండటంతో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఎన్నికల వాతావరణాన్ని మరింతగా ఆసక్తికరంగా మార్చారు.

ఈ నేపథ్యంలో విరవత్ని శ్వేతా రాజు సర్పంచ్ పదవికి తన బలగంతో వచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలు అందించిన ఆశీస్సులు మరియు తన భర్త రాజు వార్డు అభ్యర్థిగా గతంలో చేసిన ప్రజాసేవ తనకు ప్రధాన బలం అని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు సర్పంచ్ అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టి సేవ చేస్తానని శ్వేత తెలియజేశారు.
జానకంపేట్ గ్రామంలో మహిళ మణులు సర్పంచ్ నువ్వా నేనా అదే విధంగా పెరుగుతున్న పోటీతో పంచాయతీ ఎన్నికలు గ్రామంలో హాట్‌టాపిక్‌గా మారాయి.








