జానకంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చేపురి సుధారాణి నామినేషన్ దాఖలు – DRUSHYAM NEWS

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ చివరి రోజు ఉత్సాహంగా సాగింది. పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో చేపురి సుధారాణి శ్రీనివాస్ కూడా భారీగా అనుచరుల నడుమ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని అధికారుల సమక్షంలో తన నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా చేపురి సుధారాణి మాట్లాడుతూ, జానకంపేట్ గ్రామానికి ఈసారి జనరల్ మహిళ రిజర్వేషన్ లభించడం తమకు గొప్ప అవకాశమని పేర్కొంటూ, ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ, గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, మహిళల విద్యాభివృద్ధి, యువతకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై కృషి చేస్తామని తెలిపారు.
తన నామినేషన్ ప్రక్రియలో తోడ్పడిన గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో విజయం సాధించి సేవ చేయడమే తన లక్ష్యమని చేపురి సుధారాణి పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment