|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఒక్కే కుటుంబంలో వరుస మృతులతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత బుధవారం సాయంత్రం, సాయల్ల మల్లయ్య అనే వ్యక్తి పశువులను బయటకు తీసుకురావడానికి బతుకమ్మ చెరువులో దిగగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దినకర్మను కుటుంబం ఆదివారం రోజున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే, అదే శనిరోజున సాయంత్రం సాయల్ల మల్లయ్య కుమారుడు సాయల్ల భాను ప్రకాష్ (వయసు 30) తీవ్రమైన కామెర్ల వ్యాధితో మరణించాడు.
నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి, తనయుడి మరణం చోటుచేసుకోవడం గ్రామస్తులను తీవ్ర బాధాకర పరిస్థితుల్లో ముంచేసింది. కుటుంబంలో నిస్సహాయత, గ్రామంలోని ఒకే కుటుంబంలో రెండు ప్రాణనష్టాలు తీవ్రంగా కలిచివేశాయి.








