పులి అలజడితో భయపడుతున్న రైతులు, మేకల కాపరులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామం నుండి నవీపేట్ వైపు వెళ్లే మార్గంలోని కంకర క్రషర్ మిషన్ సమీపంలో గల పంట పొలాల వద్ద గత వారం రోజుల క్రితం నుండి పులి అడుగుజాడలు కనిపిస్తున్నాయని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.

గత రెండు రోజుల క్రితం, మేకల కాపరులు తమ మేకలను మేపడానికి వెళ్లినప్పుడు, మేకల గుంపు నుండి పులి మేకను తమ కండ్ల ముందే ఎత్తుకెళ్లిందని, ఈ సంఘటనతో పశువుల కాపరులు మరియు మేకల కాపరులు భయంతో ఆ ప్రాంతం వైపు వెళ్లటం మానుకున్నామని చెప్పారు.

రైతులు, తమ పంట పొలాలకు వెళ్లాలంటే భయం వేస్తోందని, పొలాల వద్దకు వెళ్లకపోతే పంటలు నాశనం అవుతాయని తెలుపుతూ, వారు మరో ఇద్దరిని తోడుగా తీసుకుని పొలాల వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఇకనైనా అటవీ శాఖ అధికారులను త్వరగా స్పందించి తగు చర్యలు చేపట్టి పులిని అదుపులోకి తీసుకోవాలని రైతులు, కాపరులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment