|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.

అదేవిధంగా బాణా సంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుందని, రైతులు భవిష్యత్తులో ఇంకా మంచి సహాయాలు, సంక్షేమం కోసం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీరడి రవికుమార్, జక్కు చిట్టిబాబు, గోవింద్ రెడ్డి కట్ట లక్ష్మన్, కోలా విజయ్ చందర్, బజానోళ్ల గంగారాం, సుంకరి సుదర్శన్, జక్కు రాజకుమార్, దండెం సాయిలు, కట్ట చిన్న లాస్మయ్య, బెజ్జంకి కొమురయ్య, వాయు కుమార్, కట్ట సుదర్శన్ , తాడేం అనిల్ తదితరులు పాల్గొన్నారు.








