|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ జాకోరలో, అకాల ఈదురు గాలులు మరియు వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.
లక్షల రూపాయల వడ్డీ తీసుకొని వరి పంట సాగు చేసిన రైతుల పంట మొత్తం నేలమట్టమైంది. ఈ దుర్ఘటనకు సంబంధించి, గ్రామంలోని రైతులు తీవ్ర బాధతో “మమ్మల్ని ఆదుకునే నాధుడే లేడా?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, బాన్సువాడ నియోజకవర్గం కిసాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ శనిగరం కిషన్ మాట్లాడుతూ, “అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని” ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యుడు, వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సమస్యపై సానుకూల చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం సత్వర చర్యలు అవసరం అని చెప్పారు.










