వ్యవసాయ భూముల దారి సమస్యకు పరిష్కారం – అధికారుల చొరవపై రైతుల హర్షం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 17 లో పెట్రోల్ బంక్ పక్కన ప్రహరీ గోడ నిర్మాణం వల్ల స్థానిక నివాస గృహాలు మరియు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు దారి మూసుకుపోయింది.

ఈ విషయమై గ్రామస్తులు వినతిపత్రాల ద్వారా జిల్లా కలెక్టర్ మరియు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎడపల్లి మండల అధికారుల చొరవతో, స్థల యజమాని 12 అడుగుల దారిని అందించేందుకు అంగీకరించడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.

ఈ సందర్భంగా గ్రామస్థులు మిద్దె పోశెట్టి, వెల్మల జీవన్, వనం పాపయ్యలు ఈ పరిణామాన్ని సంతోషకరంగా పేర్కొన్నారు. రైతుల కోసం, స్థానిక నివాసుల కోసం ఈ సమస్య పరిష్కార దిశగా సహకరించిన రెవెన్యూ, ప్రజా పరిషత్ అధికారులకు, సిబ్బందికి, స్థల యజమానికి, మరియు మీడియా ప్రతినిధులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో మిద్దె పోశెట్టి పరిసర రైతులు వారి భూముల నుంచీ 12 అడుగుల దారిని ఇవ్వనున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment