పొలం బాట కార్యక్రమం : విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ మండలం పెంటకుర్దు మండలంలోని రైతుల సమక్షంలో పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిఈ టెక్నికల్ రమేష్ మాట్లాడుతూ, రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా పొలాల్లో ఉపయోగించే మోటార్లు, స్టార్టర్లు, పివిసి పైపులు, మరియు ఐఎస్ఐ నాణ్యత ప్రమాణాలతో ఉండాలని సూచించారు.

అదేవిధంగా విద్యుత్ మోటార్లతో సంబంధించి లోఓల్టేజి సమస్యలను నివారించడానికి ప్రతి రైతు కెపాసిటర్‌లు అమర్చుకోవాలని ఈ చర్య ద్వారా రైతులు విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు అని, విద్యుత్ పరంగా ఏదైనా సమస్య వచ్చినా సంబంధిత విద్యుత్ అధికారులు లేదా సిబ్బందికి వెంటనే తెలియజేసి సమస్య పరిష్కరించుకోవాలని రైతులకు తెలుపుతూ రైతులు మరియు పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడిఈ నగేష్ కుమార్, ఏఈ కాళ్యాణ్, బోధన్ సబ్ ఇంజనీర్లు ఓంప్రకాష్, రాజశేఖర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment