నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందచేసిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అర్బన్ ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పలు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక అభిలాషలు, ప్రాధాన్యతలపై దృష్టి సారించి, సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల మంజూరుకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది.

హౌసింగ్ అభివృద్ధి
ఇందిరమ్మ పథకం కింద మంజూరైన 3500 ఇండ్లకు భూముల కొరత కారణంగా కేవలం 1757 ఇండ్లు మాత్రమే శాంక్షన్ అయ్యాయి అని, మిగిలిన 1753 లబ్ధిదారులకు చంద్రశేఖర్ నగర్ లో ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేయబడింది.

ప్రభుత్వ ఆసుపత్రి, స్కూల్ మరియు మౌలిక వసతులు
ఇందూరు నగరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 10-12 ఎకరాల స్థలం కేటాయించాలనీ, ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునిక పరికరాలు, వైద్య సిబ్బంది నియామకం కోసం నిధులు మంజూరు చేయాలనీ కోరారు.

మున్సిపల్ అభివృద్ధి
రూ.99.78 కోట్లతో రోడ్లు, పార్కులు, జంక్షన్ అభివృద్ధి పనుల ప్రణాళిక సమర్పించారు. బస్ స్టాండ్, ఐటీ హబ్, మరియు డబుల్ బెడ్రూం ఇండ్ల మరమ్మత్తులకు అదనపు నిధుల అవసరం గుర్తించారు.

SDF, CDP నిధులు
రూ.10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వెంటనే విడుదల చేయాలని, CDP నిధులు రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
నిజామాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఎమ్యెల్యే తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment