|| దృశ్యం న్యూస్ ||
బోధన్ మండలం పెగడపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో రేపు (నవంబర్ 23) మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు.
ఈ అంతరాయం సబ్ స్టేషన్ లో జరుగుతున్న మరమ్మత్తుల కారణంగా ఉంటుందని ఏడి ప్రభాకర్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
సబ్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి, బర్దిపూర్, భూలక్ష్మి క్యాంప్, పెంటకాలన్, లంగ్డపూర్ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని, మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రస్తుత విద్యుత్ సేవలలో అంతరాయం ఏర్పడుతుందని తెలియజేశారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించడంలో పాటు తమ సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.










