మొక్కలు నాటాలని డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు సూచన.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చెగుంట మండల కేంద్రంలో గురువారం రోజున “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
జిల్లా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో కలిసి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,37,000 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 200 కొబ్బరి మొక్కలు నాటబడినట్లు ఆయన వెల్లడించారు, ఈ మొక్కలు మూడు సంవత్సరాలు సంరక్షించిన తర్వాత తగిన ప్రతిఫలలు ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి అవసరమైన ఆక్సిజన్ కూడా అందిస్తాయని తెలిపారు.

మొక్కలను ప్రతి ఒక్కరూ తమ పర్యావరణంలో సంరక్షించాలని డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు, రెసిడెన్షియల్ పాఠశాలలో 200 మొక్కలు నాటబడినట్లు చెప్పారు, విద్యార్థులు కూడా ఈ మొక్కల సంరక్షణలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అయిత పరంజ్యోతిని ఆయన అభినందించారు,

కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు, అదిషనల్ డి.ఆర్.డి.ఓ సరస్వతి, డిపిఓ ప్రకాష్, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏపిఎం లక్ష్మీనరసమ్మ, ఏపీవో శ్వేత, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, ప్రిన్సిపల్ సుమతి, నాయకులు జూకోటి రాజు, సీసీలు శ్వేత, శంకర్, రామస్వామి అంజి, స్వామి వివో ఏలు హారిక, సరిత, జ్యోతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment