డబుల్ వీల్ మార్కర్ యంత్రం – మొక్కజొన్న రైతులకు ప్రయోజనకరమైన నూతన పరిష్కారం.

|| దృశ్యం న్యూస్ ||

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కజొన్న సాగును ప్రోత్సహించేందుకు “డబుల్ వీల్ మార్కర్ యంత్రం”ను రైతులకు అందజేశారు. వారధి మాగాణిల్లో నేరుగా మొక్కజొన్న సాగు (No-Till Corn Cultivation) చేయాలనుకునే రైతులకు ఈ యంత్రం ఎంతో సహాయకరమని DRF ప్రతినిధి ఫణీంద్ర తెలిపారు.

సాలురా మండల పరిధిలోని కుమ్మనపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో, వరుసల మధ్య సమాన దూరంలో విత్తనాలను నాటేందుకు ఈ డబుల్ వీల్ మార్కర్ రైతులకు వివరిస్తూ, భూమి దున్నకుండా మొక్కజొన్న సాగు చేయడం వల్ల అదనపు ఖర్చులు తగ్గడంతో పాటు సుమారు 2–3 నీటి తడులు ఆదా అవుతాయని చెప్పారు. గ్రామస్థాయిలో అనుభవం ఉన్న రైతుల వద్ద ఈ యంత్రాలను ఉంచి, రైతులు అందరూ పరస్పర సహకారంతో వినియోగించుకోవాలని సూచించారు. ఈ విధానం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెంపుతో పాటు స్థిరమైన పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేస్తుందని DRF ప్రతినిధులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment