|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి వచ్చిన పిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు అందించారు.
సోమవారం జరిగిన ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐ, సి.ఐ లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రజలు ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా స్వేచ్ఛగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్.పీ సూచించారు.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరించి వాటిని చట్టపరంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు మరింత చేరువ కావడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని జిల్లా ఎస్.పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. స్పష్టం చేశారు.








