|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అత్యవసర మెడికల్ సేవలను పరిశీలించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం, పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ – 2023 అమలులో ఉంచినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడానికి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పరీక్షా సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయగా, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్స్ పర్యవేక్షణలో పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.








