|| దృశ్యం న్యూస్ ||
మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా అధికారి విజయ గురువారం సందర్శించారు. తరగతి గదుల్లో బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించి ఉపాధ్యాయుల బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మిడ్ లైన్ పరీక్ష నిర్వహణ, మధ్యాహ్న భోజన నాణ్యతను కూడా పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉత్తమ భోజనం అందిస్తున్నట్లు పేర్కొంటూ, విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని సూచించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు అందిస్తూ జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు నోటు పుస్తకాలు మొత్తం అందజేసిందని గుర్తుచేసి ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్నట్లు తెలిపారు.








