మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రాహుల్ రాజ్ రాబోయే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి పలు స్థలాలను పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లు డ్రైనేజీల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించి, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చూసుకోవాలని సూచించారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ సిబ్బందిని పరిశుభ్రతను ప్రతిరోజూ కాపాడటానికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహేష్, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడానికి సిబ్బందికి కలెక్టర్ ముఖ్యమైన సూచనలు చేశారు.
అధికారులు ప్రజలతో సమన్వయం పెంపొందిస్తూ మెదక్ పట్టణం సమగ్ర అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment