|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం, పిల్లికొటాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో పేడియాట్రిక్ వార్డు, ఐ.సి వార్డు మరియు గైనిక్ ఆపరేషన్ వార్డులను పరిశీలించి ఆసుపత్రి పరిసరాల నాణ్యతను కూడా సమీక్షించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులకి మరియు బాలింతలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రోగుల నుండి మంచి స్పందన వచ్చిన తరువాత ఆహార నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

గర్భిణులకు మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యం కోసం, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి అని, ఆహారపు నాణ్యతలో రాజీ పడకూడదు అని సిబ్బందికి కలెక్టర్ తెలియచేసారు.
పర్యటన అనంతరం రాహుల్ రాజ్, ఉన్నత వైద్యులతో కలిసి రోగులకు వడ్డించే ఆహారాన్ని స్వీకరించారు,
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శివదయాల్, ఆర్.ఎం.ఓ షర్మిల, ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్, గైనిక్ హెచ్.ఓ.డి లు సునీత రాజేశ్వరి మరియు ఇతరులు పాల్గొన్నారు.








