విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజనం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.

అలాగే తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నూతన పిహెచ్సి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణ అవసరాలపై అధికారులతో చర్చించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జయచంద్రరెడ్డి, తాసిల్దార్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment