|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. స్టేడియం వద్ద ఉన్న నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థినులు రాస్తున్న ఫ్రీ ఫైనల్ పరీక్షల పై సమీక్షించారు. అనంతరం గురుకుల పాఠశాలలో మెనూ అమలు తీరును పరిశీలించేందుకు విద్యార్థినులతో మమేకమై వారితో కలిసి భోజనం చేశారు.

కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా లేదా అనే విషయంలో విద్యార్థినులను ప్రశ్నించారు. విద్యా బోధనపై కూడా విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సూచనలు చేస్తూ, ఎస్.ఎస్.సి పరీక్షలు జీవితానికి ఓ కీలక మలుపు అని, క్రమశిక్షణ, పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గౌరవాన్ని తీసుకురావాలని ప్రేరేపించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎం.ఈ.ఓ నీలకంఠం, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.








