సాగునీటి నిర్వహణపై పటిష్ట చర్యలు చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మంగళవారం కూల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో రైతులతో కలెక్టర్ రాహుల్ రాజ్ వరి పంట పరిశీలన చేసి సాగునీటి పారుదలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వేసవికాలంలో వరి పంటకు నీటిపారుదల శాఖ ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం వరి పంటకు నీటి కొరత ఉండడంలేదు అని వెల్లడించారు.

రైతులకు సాగునీరు సరఫరా పై అవసరమైన సహాయం అందించేందుకు మోటార్లకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. “భూగర్భ జలాలను అవసరమైనంత మాత్రమే వినియోగించి, వాటిని పొదుపుగా ఉపయోగించాలని” సూచించారు.

పంటలు ఎండకాలంలో బాగా కాపాడుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ, వ్యవసాయ అధికారులు దీనికి అనుగుణంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment