మెదక్‌ : నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మే 4న నిర్వహించనున్న NEET-2025 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) కోసం మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ఏరియా, ధ్యాన్‌చంద్ చౌరస్తా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల & ఆర్ట్స్ కళాశాల స్టేడియం దగ్గర ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

జిల్లా కేంద్రంలో 1000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్న నేపథ్యంలో, పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించామని కలెక్టర్ తెలిపారు.

పరీక్ష హాలుల్లో విశాలమైన గదులు, గాలి, వెలుతురు, విద్యార్థుల కోసం బెంచీలు, కుర్చీలు అందుబాటులో ఉన్నాయని, భద్రత పరంగా సీసీ కెమెరాల పనితీరు సమీక్షించి, ప్రహారి గోడ, విద్యుత్ సరఫరా, తాగునీరు, మూత్రశాలల సౌకర్యాలను పరిశీలించామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్శనలో అదనపు ఎస్పీ మహేందర్, డీఈవో రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం, సంబంధిత ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
NEET-2025 పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment