ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రేమ, సమానత్వానికి ప్రతీకగా, సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని ఆకాంక్షించారు.

ప్రజలు ఈ రంగుల పండుగను సంప్రదాయబద్ధంగా, భద్రతతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ ఆడిన తరువాత బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానం చేయకుండా ఉండాలని, ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.

ప్రత్యేకంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను నిర్లక్ష్యంగా బయటకు వెళ్లనివ్వకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment