ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి 85 దరఖాస్తులు అందాయి.

అర్జీల సంఖ్య:
✅ ధరణి సమస్యలు – 30
✅ పెన్షన్ – 03
✅ ఇందిరమ్మ ఇల్లు – 03
✅ ఉద్యోగ ఉపాధి – 02
✅ ఇతర సమస్యలు – 47

కలెక్టర్ అధికారులకు తగిన సూచనలు ఇచ్చి, ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారం అందించాలన్నారు. ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment