మెదక్ జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం సేకరణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ ||

2025-26 ఖరీఫ్ వరి ధాన్యం సేకరణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ముఖ్య సూచనలు చేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి వరి సేకరణ ప్రారంభం కానుండగా, అన్ని శాఖలు సమన్వయంతో సకాలంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించామని, ఖరీఫ్ సీజన్‌లో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అంచనా ఉందని చెప్పారు. మిల్లుల ట్యాగింగ్, సర్టిఫికేషన్, ధాన్యం రవాణా వాహనాలకు జిపిఎస్ తప్పనిసరి, గోదాముల కొరత నివారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా సూచించారు.

గ్రేడ్-A వరికి క్వింటాకు ₹2,389, సాధారణ వరికి ₹2,369 కనీస మద్దతు ధరగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు. గత సీజన్‌లో మిల్లులకు చేరిన 5.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 3.82 లక్షల మెట్రిక్ టన్నుల CMR బియ్యం మాత్రమే వచ్చినందున, మిగిలిన 1.58 లక్షల మెట్రిక్ టన్నులను త్వరగా రికవరీ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment