పేదల భూములను కబ్జా చేస్తే శిక్ష తప్పదు : జిల్లా సహాయ కార్యదర్శి దాసు స్పందన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో ధర్పల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పేదల భూములను ఆక్రమించి అమ్ముతున్న వారిని శిక్షించాలని, స్థానిక తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించి 1992, 2006 సంవత్సరాలలో ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన పట్టాలపై మలావత్ బాలు, జమీల్ భూములను కబ్జా చేసి అమ్ముకుని మోసం చేశారని ఆరోపించారు.

దాసు మాట్లాడుతూ, ఆర్టీసీ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి దళితుడు నారాయణనను మోసం చేసి 10 లక్షలు చెల్లించుకున్నారని, నగదు తిరిగి ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ తప్పుడు కేసులు పెట్టడానికి కుట్ర చేస్తున్నారని తెలిపారు,
అదేవిధంగా మలవత్ బాలు సిర్నాపల్లి లక్ష్మీదేవి భూమిపై హక్కులు కోల్పోయేలా చేస్తున్నాడాని స్థానిక అధికారులు సర్వే చేసినందుకు సహకరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలి అని దాసు ప్రభుత్వ అధికారులకు వినతి చేస్తూ ప్రభుత్వ అధికారులు చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే, మేము తీవ్రంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు,

ఈ ధర్నాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య, పద్మ, గంగాధర్, కృష్ణ, వెంకటి, చలిమల నవీన్ చంద్రమౌళి, మేతరి నారాయణ సిర్నపల్లి గంగాధర్ బుడాల ప్రశాంత్, కనకపెద్ద బాల్రెడ్డి, శోభారాణి, ఆకుల రవి, రమేష్, ఆరేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment