జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన ఇంచార్జ్‌గా గూగులోత్ గౌతమ్ నాయక్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్య కార్యక్రమం జరిగింది. జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ చేతుల మీదుగా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ యువజన ఇంచార్జ్‌గా గూగులోత్ గౌతమ్ నాయక్ నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మండల యువజన అధ్యక్షులుగా గూగులోత్ గణేష్ నాయక్ అధ్యక్షులుగా బానోత్ మంగులాల్ నాయక్ , కోశాధికారిగా భూక్య గణేష్ నాయక్ ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శి కేతావత్ పీర్ సింగ్ నాయక్, జిల్లా కోశాధికారి రాథోడ్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. యువజన నేతలు మాట్లాడుతూ బంజారా సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు సభావత్ శరాములు నాయక్ నేతృత్వంలో బంజారా యూత్ బలోపేతానికి చర్యలు కొనసాగుతాయని తీర్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment