|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ పిర్యాదులను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చు అని, ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఐలు (SI), సీఐలు (CI) పాల్గొని, తక్షణమే ఫిర్యాదుల పరిష్కారానికి తగిన సూచనలు అందించారు. జిల్లా పోలీసులు ప్రజా సమస్యలను పారదర్శకంగా పరిష్కరించడం లక్ష్యంగా పనిచేస్తున్నారని అదనపు ఎస్పీ తెలిపారు.
పోలీసు సేవలను మూడో వ్యక్తి హస్తక్షేపం లేకుండా వినియోగించుకోవాలని, ఎటువంటి పర్యవేక్షణ లేకుండా నేరుగా తమ సమస్యలు తెలియజేయవచ్చని సూచించారు. ప్రజల భద్రత కోసం, శాంతి భద్రతలను కాపాడే విధంగా పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు.








