|| దృశ్యం న్యూస్ ||
లయన్స్ క్లబ్ ఎడపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు స్థానిక అంగన్వాడి కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా చిన్నారులకు పలకలు, బిస్కెట్ ప్యాకెట్లు, మరియు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్య అభివృద్ధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అదే సమయంలో, వన మహోత్సవాల సందర్భంగా అంగన్వాడి ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. లయన్స్ క్లబ్ ప్రతినిధి గంగారెడ్డి మాట్లాడుతూ, “గ్రామీణ పిల్లల భవిష్యత్తు కోసం మేము కృషి చేస్తున్నాం,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గంగారెడ్డి, పుష్ప, మనోజ్, మెరిసే, కదం ప్రకాష్ రావు, అంగన్వాడి టీచర్ కృష్ణ తులసి తదితరులు పాల్గొన్నారు.








