బాన్సువాడలో 66 మంది CMRF లబ్ధిదారులకు రూ. 23.25 లక్షల చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం రూ. 23,25,500/-ను బాన్సువాడ నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బాన్సువాడ పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజు నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపాలిటీకి చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ. 6,03,000/-, బాన్సువాడ గ్రామీణ మండలానికి చెందిన 12 మందికి రూ. 3,39,500/-, బీర్కూర్ మండలానికి చెందిన 2 మందికి రూ. 45,000/- అందించారు. అలాగే నసురుల్లాబాద్ మండలానికి చెందిన 8 మందికి రూ. 2,47,000/-, మొస్రా మండలానికి చెందిన ఒక్కరికి రూ. 38,000/-, చందూర్ మండలానికి చెందిన 5 మందికి రూ. 1,67,000/- పంపిణీ చేశారు.

అలాగే వర్ని మండలానికి చెందిన 6 మందికి రూ. 2,69,500/-, రుద్రూర్ మండలానికి చెందిన ఒక్కరికి రూ. 11,000/-, కోటగిరి మండలానికి చెందిన 9 మందికి రూ. 3,31,500/-, పోతంగల్ మండలానికి చెందిన 8 మందికి రూ. 2,14,000/- పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. CMRF సహాయ నిధి ద్వారా పేద కుటుంబాలకు వైద్య, ఆరోగ్య అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment