|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హోమ్ గార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. డి.జి.పి. కార్యాలయం నుండి పంపిన రెయిన్ కోట్స్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ రోజు తన కార్యాలయంలో హోమ్ గార్డ్ సిబ్బందికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోమ్ గార్డ్స్ కూడా పోలీస్ శాఖలో కీలక భాగమని మరియు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో విధులు నిర్వర్తించే సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా హోమ్ గార్డ్స్ సమర్థవంతంగా బందోబస్తు విధుల్లో పాల్గొని పోలీస్ శాఖకు బలాన్నిస్తున్నారని ప్రశంసించారు.

అలాగే హోమ్ గార్డ్స్ సిబ్బంది ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ సిబ్బందికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగ నాయక్, ఆర్ఐ శైలేందర్, ఆర్ఎస్ఐ నరేష్, హోంగార్డ్ ఆఫీస్ రైటర్ శ్రవణ్ మరియు హోమ్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.








