చౌటకూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ ||

చౌటకూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ ఆధ్వర్యంలో 21 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆందోల్-జోగిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. చౌటకూర్ మండల తహసిల్దార్ మాన్నే కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

గ్రామ ప్రెసిడెంట్లు, యువకుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment