|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలానికి చెందిన ప్రజలకు శుభవార్త! ఈ సోమవారం, డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్.ఎల్.జి. (SLG) గార్డెన్‌లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సర్కార్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ పథకాలు ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఉపకరించనున్నాయని ప్రజలు ఈ పథకాలపై సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు.
ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థికంగా మద్దతు అందించడం, వారి ఆర్థిక స్థితిని మెరుగు పరచడం ముఖ్యంమైన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుందని, సామాన్య ప్రజలు ప్రభుత్వ సౌకర్యాలపై అవగాహన కలిగి వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలని తెలిపారు.








