|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు హాజరయ్యారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
లబ్ధిదారులు ఈ పథకం ద్వారా తమ పిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నత్తి దశరథ, ఉపాధ్యక్షుడు కలాలి రమా గౌడ్, మల్లారెడ్డి, వెండి కోల్ రాములు, సార గోవర్ధన్, ఈశ్వర్ గౌడ్, మండల మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు యండి కైసర్, రాజు పాల్గొన్నారు.








