|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో ఈరోజు పేదల ఆవాస కల నెరవేర్చే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలతో, తెలంగాణ ప్రభుత్వ పథకంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ మరియు ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ చిత్ర గోపాల్ రెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు గౌండ్ల శ్రీకాంత్ గౌడ్, పుట్టి నాగరాజ్, మస్తే మల్లేశం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పేదవారికి సొంతింటిని కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది ప్రతిఫలంగా నిలుస్తోంది. గ్రామస్థులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షించారు.








