నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు తపాలా శాఖ ద్వారా పంపిణీ.

|| దృశ్యం న్యూస్ ||

రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి.

రాష్ట్రంలో నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.

సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, కొత్తగా ఓటర్లుగా నమోదు అయిన ప్రతి ఒక్కరికి తపాలా సేవల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు అందేలా చూడాలని సూచించారు. అలాగే ఓటరు జాబితాలో 100 ఏళ్ల పైబడిన ఓటర్ల వివరాలను తగిన ఆధారాలతో సమర్పించాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని సూచించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment