బాన్సువాడ నియోజకవర్గంలో CMRF చెక్కుల పంపిణీ: ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలో తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు మొత్తం రూ. 4,73,000/- విలువైన చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నిధి ద్వారా అనేక మంది వైద్య సహాయం, ఆరోగ్య సేవలు అందించుకోవచ్చు. CMRF ద్వారా ప్రభుత్వం ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది అని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment