|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోగులూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ పల్లె కిష్టయ్య, వార్డు సభ్యులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకుడు ఆలూరు బ్రహ్మానంద రెడ్డి, గోపాల్ రెడ్డి, ఆలూరు నరసింహ రెడ్డి, కారోబార్ కృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వ సహాయం అందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఇలాంటి పథకాలు ఎంతో ఉపయోగకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ చెక్కుల పంపిణీతో గ్రామంలో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగిందని నాయకులు పేర్కొన్నారు.








