|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ మరియు బీర్కూర్ మండలాల సంబంధిత 34 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు లబ్ది చేకూరింది.
తాడకోల్ గ్రామపంచాయతీ రాజారాం దుబ్బ నుండి 16 లబ్ధిదారులకు రూ. 14,51,000/- , మరియు బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన 18 లబ్ధిదారులకు రూ. 8,69,570/-, మొత్తం విలువ రూ. 23,20,570/- ఇవ్వబడింది.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన గృహాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.








