|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో గురువారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ధర్పల్లి పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పోటీలలో గ్రామానికి చెందిన కట్ట ఇంద్ర ఉత్తమ బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక బహుమతి అందుకున్నారు.
ఈ సందర్భంగా ధర్పల్లి ఎస్‌ఐ కళ్యాణి ఆమెకు బహుమతిగా చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు అందించి అభినందించారు.
ఎస్‌ఐ కళ్యాణి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల గౌరవానికి ప్రతీక అని, పూలలోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ పండుగ మనసులోని ఈర్ష్య, ద్వేషం, కోపం వంటి చెడు గుణాలను తొలగించి ఐకమత్యం, శాంతి, సోదరభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.








