మెదక్ జిల్లా అభివృద్ధిపై దిశ కమిటీ సమీక్ష – త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దిశ కమిటీ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కీలక శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పథకాల పురోగతి, బడ్జెట్ వినియోగం, లబ్ధిదారుల ఎంపిక, పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్‌లో త్వరలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్టు, జిల్లా కలెక్టర్ చొరవతో 1000 గజాల స్థలం కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది అని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ సిఎస్‌ఆర్ నిధులతో ₹69.59 లక్షల వ్యయంతో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు అందించనుంది. ఈ బస్సు ద్వారా ప్రతి మండలంలో క్యాన్సర్ ప్రిలిమినరీ టెస్టులు నిర్వహించబడతాయని వెల్లడించారు.

అదేవిధంగా జిల్లా అభివృద్ధికి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, పీఎంఏవై, రహదారుల అభివృద్ధి వంటి కీలక అంశాలు సమీక్షించబడ్డాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment