|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం తండాకు చెందిన కిరణ్, బెల్యనాయక్ తండాకు చెందిన రవీందర్ అనే 9వ తరగతి చదివే విద్యార్థులు పండగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లి బుధవారం పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత కాసేపటికే కనబడకుండా పోయారు.
విద్యార్థులు కనపడకపోవడంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్వయంగా గాలింపు ప్రారంభించారు. పాఠశాల వార్డెన్ ఈ ఘటనపై వర్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కూడా తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైనా ఈ ఇద్దరు చిన్నారుల ఆచూకీ తెలిసినచో వర్ని పోలీస్ స్టేషన్: 8712659786, వర్ని ఎస్ఐ: 8712659877 వెంటనే సంప్రదించమని కోరారు.








