|| దృశ్యం న్యూస్ ||
లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్-320D లయన్ నాగేష్ పంపాటి ఆదేశాల మేరకు, జిల్లా కార్యదర్శి, మధుమేహ అవగాహన-320D లయన్ డాక్టర్ అనంతరెడ్డి, నవంబర్ నెలను మధుమేహ అవగాహన వారోత్సవంగా ప్రకటించారని, ఈ మేరకు నెల రోజులు లయన్స్ క్లబ్ వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని అని తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం రోజున చేగుంట మండల కేంద్రంలోని KGS హాస్పిటల్ లో డయాబెటిక్ పర్మినెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామస్థులకు డయాబెటిక్ టెస్ట్ చేయబడింది.
ఈ కార్యక్రమంలో లయన్ నాగేశ్వరయ్య KGS హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
మధుమేహ అవగాహనకు సంబంధించి ఈ కార్యక్రమం సాంకేతిక, వైద్య, మరియు సామాజిక అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది అని వారు తెలిపారు.








