లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో మధుమేహ పరీక్షలు : అవగాహన.

|| దృశ్యం న్యూస్ ||

లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో లయన్ నాగేష్ పంపాటి జిల్లా గవర్నర్-320D ఆదేశాల మేరకు, లయన్ డాక్టర్ అనంతరెడ్డి జిల్లా కార్యదర్శి మధుమేహ అవగాహన-320D నవంబర్ నెలను మధుమేహ అవగాహన వారోత్సవ నెలగా ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా, మంగళవారం రోజు చేగుంట గ్రామంలోని KGS హాస్పిటల్లో 13 మందికి డయాబెటిక్ టెస్ట్‌లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఆఫ్రిన్ పాల్గొన్నారు.

మధుమేహం పై అవగాహన పెంచడానికి, ఈ టెస్ట్‌ల ద్వారా సకాలంలో ఈ వ్యాధిని గుర్తించి, క్రమమైన చికిత్స తీసుకోవడం ఎంత అవసరమో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రజలలో మధుమేహం గురించి అవగాహన పెంచేందుకు తోడ్పడుతుందని, మధుమేహ అవగాహన కోసం అందరికి ఈ రకమైన ఆరోగ్య సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ నిరంతరం కృషి చేస్తూ, సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తుందని వారు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment