ధర్పల్లి యువకునికి గ్రూప్ ఫోర్ ఉద్యోగం: కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మారిపెద్ది రాహుల్ S/o మరిపెద్ది రాజు, నిజామాబాద్ కలెక్టరేట్ ఎస్సీ కార్పొరేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక అయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో రాహుల్ ఈ గుర్తింపును సాధించాడు.

గ్రూప్ ఫోర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన రాహుల్ యొక్క విజయంతో ధర్పల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యులు ఈ విజయాన్ని ఘనంగా ఆహ్వానింస్తూ ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
రాహుల్ కష్టపడి మంచి ఫలితం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

ఈ విజయంతో ధర్పల్లి గ్రామ యువకులకు ఒక మంచి మద్దతు మరియు ప్రేరణగా మారుతుందని, ఇకపై తన విధుల్లో మరింత కృషి చేసి, గ్రామానికి సేవ చేయాలని పలువురు ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment