ధర్పల్లి: వాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ సమాజసేవలో మెటీ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, వాడి గ్రామంలో వరదల సమయంలో పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ అహర్నిశలు శ్రమించి ప్రజలకు అండగా నిలిచారు. అధికారులు, నాయకులు సందర్శించి వెళ్లిపోయినా, ఇలియాస్ మాత్రం గ్రామంలోనే ఉండి ప్రజల సమస్యలను పై అధికారులకు తెలియజేస్తూ సహాయం అందించారు. వినాయక నిమర్జనం సందర్భంగా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ఇలియాస్‌కు సన్మానం నిర్వహించారు.

యువకులు మాట్లాడుతూ, ఇలియాస్ లాంటి నిబద్ధత కలిగిన సెక్రటరీని జిల్లాలో చూడలేదని, గ్రామానికి అదృష్టమని పేర్కొన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో ఆయన కృషి గ్రామస్థులందరికీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర్, రవి రెడ్డి, శ్రీకాంత్, కట్ట ప్రసాద్, సందీప్, రుతిక్, నవీన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment