|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన ఏ. బాలకృష్ణ బదిలీపై కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. 2024 ఫిబ్రవరి 13న ఛార్జ్ తీసుకున్న ఎంపీడీవో మండలంలో ప్రజల మన్ననలు పొందుతూ సమర్థవంతంగా సేవలందించారని బదిలీ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ప్రస్తుతం ఇంచార్జ్ ఎంపీడీవోగా ఎంపీఓ రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. బదిలీ నేపథ్యంలో ఎంపీడీవో బాలకృష్ణ మాట్లాడుతూ, తన పని కాలంలో సహకరించిన అధికారులకు, ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మనోహర్ రెడ్డి, చిన్నారెడ్డి, మీట గంగారెడ్డి, చెలిమెల శ్రీనివాస్, గ్రంథాలయ బాలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








