|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా ధర్పల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.

భాజపా శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని భాజపాకు మద్దతుగా నిలిచిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా, ఈ విజయం ఇతర పార్టీలకు గుణపాఠంగా మారిందని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కర్క గంగారెడ్డి, పెద్ద బాల్రెడ్డి, కోమటిదాస్, చిలుక మహేష్, రాజశేఖర్, రాజేందర్, రాజు, శ్రీకాంత్ సహా అనేక గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.








